ఆసక్తి రేకెత్తిస్తున్న 'జ‌న‌తా హోట‌ల్' టీజ‌ర్‌

Sat,September 8, 2018 11:18 AM
JANATHA HOTEL TEASER released

మ‌హాన‌టి ఫేం దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ఉస్తాద్ హోట‌ల్‌. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో జ‌న‌తా హోట‌ల్ పేరుతో సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌బోతున్నాడు. సురేష్ కొండేటి నిర్మించిన ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జ‌ర్నీ వంటి సినిమాలకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో ఈ సినిమాపై కూడా భారీ ఆస‌క్తి నెల‌కొంది. గ్లామ‌ర్ భామ నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీకి సంబంధించిన టీజ‌ర్స్ ని రోజుకొక‌టి చొప్పున విడుద‌ల చేయాల‌ని భావించారు. ఇందులో భాగంగా తొలి టీజ‌ర్ విడుద‌ల చేశారు.ఇందులో తండ్రికి వ‌రుస‌గా న‌లుగురు ఆడ‌పిల్ల‌లు పుట్ట‌డం, అయిన ఆశ‌తో అబ్బాయి కోసం ఎదురు చూడ‌డం, చివరికి ఐదో సంతానంగా అబ్బాయి పుట్ట‌డం.. పుట్టిన పిల్లాడు తండ్రికి న‌చ్చ‌కుండా సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. చివ‌ర‌కి పెళ్లి చూపులో క్వాలిఫికేష‌న్ ఏంట‌ని అమ్మాయి అడిగితే , విదేశాల‌లో చెఫ్ కోర్సు మాత్ర‌మే చేసాన‌ని చెప్ప‌డం.. ఇలా పలు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో టీజ‌ర్‌ని రూపొందించి విడుద‌ల చేశారు.కొద్ది సేప‌టి క్రితం రెండో టీజ‌ర్ కూడా విడుద‌లైంది. ఇది ఆక‌ట్టుకునేలా ఉంది.సెకండ్ టీజ‌ర్

1936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles