టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వం: పవన్ కల్యాణ్

Wed,December 6, 2017 04:35 PM
Janasena not to support TDP, BJP in 2019 general elections, says Pawan kalyan

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వబోమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖపట్టణంలో ఇవాళ జరిగిన ఓ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2019లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇవ్వదని తేల్చేశారు. డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో జరిగిన సభలో పవన్ పాల్గొన్నారు. డీసీఐని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు పవన్ స్పష్టం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తమ పార్టీ మద్దతు ఇచ్చిందని, తొలిసారి ప్రధాని మోదీకి తానో కోరికను విన్నవించినట్లు పవన్ ఈ సందర్భంగా తెలిపారు. డీసీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చనిపోయిన వెంకటేశ్ అనే ఉద్యోగి కుటుంబసభ్యులను కూడా పవన్ కలుసుకున్నారు.

2637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles