బిగ్‌బాస్-2లో 'లిప్ కిస్'.. వీడియో వైరల్

Sat,June 23, 2018 09:31 PM
Janani Iyer and Aishwarya Dutta lock lips on the show

చెన్నై: హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన 'బిగ్‌బాస్‌'ను ప్రాంతీయ భాషల్లో కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడం, మళయాలం, బెంగాళీ, మరాఠీ భాషల్లో షోను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతూ, ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్'. తమిళ బిగ్‌బాస్ షోకు కమల్‌హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను పూర్తి చేయడానికి కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు.

శుక్రవారం నాటి ఎపిసోడ్‌-6లో తమిళ కంటెస్టెంట్స్ జనని అయ్య‌ర్, ఐశ్వర్య ద‌త్త లిప్ టు లిప్ కిస్ పెట్టుకోవడం షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ విచిత్ర వేషధారణలతో పలు పాత్రలు పోషించారు. ముంతాజ్, బాలాడీ డైపర్లు వేసుకొని చిన్నపిల్లల్లా ప్రవర్తించారు. జనని, వైష్ణవి మీసాలు పెట్టుకొని మగరాయుళ్లను తలపించారు. ఐశ్వర్య, రమ్య కవలలుగా నటించారు. తెలుగు బిగ్‌బాస్-2 కూడా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. న్యాచుర‌ల్ స్టార్ నాని సీజ‌న్‌-2కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.15101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS