జేమ్స్‌బాండ్ 'స్పెక్టర్' అలరించేందుకు సిద్ధం...

Mon,November 2, 2015 02:11 PM
james bond spectre releasing world wide on november 6

ఉత్కంఠ రేపే సన్నివేశాలు... ఆకట్టుకునే ఫైట్స్... ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులు... వెరసి జేమ్స్‌బాండ్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. ఈ క్రమంలోనే బాండ్ సినిమాల జాబితాలో మరో సరికొత్త చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న జేమ్స్‌బాండ్ 'స్పెక్టర్‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ హీరో డానియెల్ క్రెగ్‌తోపాటు హీరోయిన్లు లీ సెడాక్స్, మోనికా బెల్లూసీలు ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షోను ఇటీవలే లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించారు. గతంలో డానియెల్ క్రెగ్ నటించిన 'కసినో రాయల్', 'క్వాంటమ్ ఆఫ్ సొలేస్', 'స్కై ఫాల్' చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో తాజా చిత్రం 'స్పెక్టర్' వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

1885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles