నయ‌న‌తారకి బ‌ర్త్ డే విషెస్ తెలిపిన బాల‌య్య టీం

Sat,November 18, 2017 05:04 PM
jai simha team wishes to nayantara

సౌత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ఈ రోజు 33వ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా జై సింహ చిత్ర యూనిట్ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూ న‌య‌న్‌కి విషెస్ తెలిపింది. జై సింహ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా హరిప్రియ, నఠాషా దోషిలు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. న‌య‌న‌తార దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. చివ‌రిగా వెంక‌టేష్ స‌ర‌స‌న బాబు బంగారం అనే సినిమా చేసింది న‌య‌న్. ఇటీవ‌ల అర‌మ్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ అమ్మ‌డు బాల‌య్య‌తో క‌లిసి జై సింహ సినిమా చేస్తుంది. సింహా, శ్రీరామ రాజ్యం చిత్రాల‌లో బాల‌య్య స‌ర‌స‌న న‌టించిన ఈ అమ్మ‌డు ముచ్చ‌ట‌గా మూడోసారి ఆయ‌న‌తో జ‌త‌క‌ట్టింది. కెఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జై సింహ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీని జ‌న‌వ‌రి 10, 2018న విడుద‌ల చేయ‌నున్నారు.1213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles