ప‌ది త‌ల‌ల రావణుడిగా ఎన్టీఆర్

Wed,September 13, 2017 03:27 PM
jai lavakusa sensor completed

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం జై ల‌వ‌కుశ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల‌కి సిద్ద‌మైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని యూ/ఏ స‌ర్టిఫికెట్ పొందింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత క‌ళ్యాణ్ రామ్ .. ఎన్టీఆర్ ప‌దిత‌ల‌ల ఫోటోని త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ తెలియ‌జేశాడు. ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. జై ల‌వ‌కుశ చిత్రంలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో కనిపించ‌నుండ‌గా, తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ జై పాత్ర‌కి సంబంధించింది. జై పాత్ర‌లో ఎన్టీఆర్ రౌద్రం, రాజసం క‌ల‌గ‌లిపిన రావ‌ణుడి గా క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి తొలుత జై టీజ‌ర్‌ని విడుదల చేయ‌గా, 48 గంట‌ల‌లోపే ఇటు యూ ట్యూబ్ లో ఏడు మిలియ‌న్లు , అటు ఫేస్ బుక్ లో మూడు మిలియ‌న్లు మొత్తంగా జై టీజ‌ర్ కోటి వ్యూస్ సాధించి అరుదైన ఘ‌న‌త అందుకుంది. జై టీజ‌ర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచ‌నాలు పెంచింది.


1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS