అందరిది ఒక్కటే మాట.. జై.. జై.. జై ..రావణా..!

Thu,September 21, 2017 09:52 AM
అందరిది ఒక్కటే మాట.. జై.. జై.. జై ..రావణా..!

వరుస హిట్స్ తో మంచి జోరుమీదున్న ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించాడు. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ జై,లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలు పోషించగా ఈ చిత్రం పరిపూర్ణమైన యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందింది. దసరా కానుకగా మరి కొద్ది గంటలలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న జై లవకుశ చిత్రంకి సంబంధించి తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున 3గం.లకు బెనిఫిట్ షోలు పడ్డాయి. అంతేకాదు ఓవర్సీస్ లోను ఈ మూవీ ప్రదర్శితం కాగా అందరిది ఒక్కటే మాట మూడు భిన్న పాత్రలలో ఎన్టీఆర్ నటన అదరహో అని అంటున్నారు.



రెండు మూడు రోజుల ముందు నుండే జై లవకుశ హంగామా మొదలు కాగా, ఈ రోజు థియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ భారీ కటౌట్స్ ప్రదర్శించడంతో పాటు ఆయనకి పాలాభిషేకం చేస్తున్నారు. బాణా సంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ థియేటర్స్ దగ్గర అభిమానులు చేస్తున్న సందడి పండుగ వాతావారణాన్ని తలపిస్తుంది. అయితే బెనిఫోట్ షోలు చూసిన అభిమానుల టాక్ ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కీ రోల్ పోషించి సినిమాకి అన్నీ తానై నిలిచాడని తెలుస్తుంది. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని చెబుతుండగా, బాబీ టేకింగ్, హీరోయిన్ల గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయిందని అంటున్నారు


సినిమా స్టార్టింగ్ లో జై, లవ, కుశల చిన్ననాటి సన్నివేశాలు చూపించగా, జై అనే పాత్రధారి సమాజంలో జరిగే కొన్ని అవమానకర ఘటనల వల్ల తన అభిప్రాయం మార్చుకుంటాడట. ఇక స్క్రీన్ పై ఎన్టీఆర్ తొలిసారి కుశ పాత్రతో పరిచయం కాగా, ఆ తర్వాత లవ పాత్ర ఎంటర్ అవుతుంది. కమెడీయన్స్ బ్రహ్మజీ, ప్రభాస్ శీనుల సందడి మధ్య మధ్యలో అదిరిపోయిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడట. ఇక మధ్యలో జై పాత్ర పరిచయం కాగా, ఎన్టీఆర్ రావణ ఎంట్రీ అద్భుతంగా ఉందని తెలుస్తుంది. ఇంటర్వెల్ కి ముందు జై పాత్రని పరిచయం చేసి ఆ తర్వాత , అసలు కథని ప్రారంభించారట.



ఇంటర్వెల్ తర్వాత మధ్యలో జై, లవ, కుశ ముగ్గురు అన్నదమ్ములు ఒకే చోట కలవడంతో ఆ ఫ్రేమ్ చూపరులకి కనువిందుగా ఉందని తెలుస్తుంది. రైతుకి సంబంధించిన కొన్ని ఎమోషన్ సీన్స్ ని కూడా ఇందులో పొందుపరచారట. అయితే అన్నదమ్ముల మధ్య వచ్చిన విభేదాల కారణంగా జై పూర్తి వయోలెంట్ గా మారి అభిమానులచే కేకలు పెట్టించాడట. ఇక ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా స్వింగ్ జరా సాంగ్ ఆడియన్స్ ని సీట్లలో కూర్చొనివ్వకుండా చేసిందట. చిత్రం క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ తో ఉంటుంది. అభిమానులు ఆ కొద్ది సేపు స్టోరీకి పూర్తి ఇన్వాల్వ్ అయిపోతారని టాక్. మొత్తానికి జై లవకుశ చిత్రం ద..ద..ద.. దంచికొట్టింది అనేలా ఉంటుందట. ప్రపంచ వ్యాప్తంగా 2400కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా, తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.

7254

More News

VIRAL NEWS