జై ల‌వ‌కుశ టీం స‌ర్‌ప్రైజ్ రేపే

Thu,September 14, 2017 01:36 PM
JAI LAVAKUSA 5 song released tomorrow

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రిభినయంలో నటిస్తున్న చిత్రం జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ చిత్రం సెప్టెంబర్ 21న థియేటర్స్ లోకి రానుండగా, రీసెంట్‌గా ఆడియో విడుదల చేశారు. దేవి శ్రీ అందించిన సంగీతం సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తుంది. అయితే చిత్ర యూనిట్‌ కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే విడుదల చేసి ఐదో పాట‌ని పెండింగ్‌లో పెట్టింది. ఈ పాట ఫోక్ స్టైల్‌ లో ఉంటుందని తెలుస్తుండగా, ఈ సాంగ్‌ కి ఎన్టీఆర్ స్టెప్పులు జతకలవడంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయ‌మ‌ట‌. ‘స్వింగ్ జర’ అంటూ సాగే ఈ పాట‌లో ఎన్టీఆర్‌తో క‌లిసి త‌మన్నా స్టెప్స్ వేయ‌నుంద‌ని టాక్. ఇక ఈ సాంగ్ చాలా స్పెష‌ల్ గా ఉంటుంద‌ట‌. ఈ పాట‌లో ప్ర‌తీది భిన్నంగా ఉండ‌డం వ‌ల‌న అభిమానుల‌కి కాస్త స‌ర్‌ప్రైజింగ్ ఇవ్వాల‌నే ఐదో పాట‌ని కాస్త లేట్‌గా విడుద‌ల చేస్తున్నారట‌. రాశీ ఖన్నా, నివేధా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం కళ్యాణ్‌ రామ్ నిర్మాణంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.


2179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS