ఫస్ట్ లుక్ రివ్యూ : జై లవకుశ.. స్టైలిష్ ఎన్టీఆర్

Fri,May 19, 2017 04:11 PM
Jai Lava Kusa Movie Poster Review

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఒక పోస్టర్ లో కారు దిగుతూ స్టైలిష్ గా కనిపించిన తారక్ మరో పోస్టర్ లో చేతికి సంకెళ్లతో దండం పెడుతూ కనిపించాడు.

ఇక బ్లాక్ అండ్ బ్లాక్ తో పాటుగా చేతిలో గాగుల్స్ తో ఎన్టీఆర్ లుక్ అదుర్స్ అనిపించేలా కనిపిస్తుంది. మాసిన గడ్డం.. మీసపు కట్టు ఫస్ట్ లుక్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించారు తారక్. జనతా గ్యారేజ్ తర్వాత చాలా కథలు విన్న తారక్ ఫైనల్ గా బాబికి కథకు ఓకే చెప్పాడు. ఏరి కోరి బాబిని ఎందుకు సెలెక్ట్ చేశాడో అని అందరు డౌట్ పడ్డారు. కాని ఈ ఫస్ట్ లుక్ చూస్తే కచ్చితంగా యంగ్ టైగర్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక రోల్ నెగటివ్ గా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు తారక్ లోని నట విశ్వరూపాన్ని చూపించేలా జై లవకుశ ఉంటుందట. మే 20న పుట్టినరోజు కానుకగా ఓ రోజు ముందే ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు తారక్. రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జై లవకుశ ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
2939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS