భక్తిరస చిత్రంలో ప్రతినాయకుడిగా..

Wed,December 14, 2016 11:41 AM
Jagapati Babu plays cameo role in Om Namo venkatesaya

ఫ్యామిలీ హీరో ట్యాగ్ ని తగిలించుకొని కొన్నాళ్ళు తన హవాని నడిపించిన జగపతి బాబు ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. లెజెండ్ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబుకి ప్రస్తుతం కాల్షీట్స్ ఏ మాత్రం ఖాళీగా లేవు. మరి అంతగా బిజీ అయ్యాడు అప్పటి హీరో. కేవలం తెలుగు సినిమాలలోనే కాదు తమిళం, కన్నడ భాషలలోను జగపతి బాబు హవా నడుస్తోంది. ఇక ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తోన్న భక్తి రస చిత్రంలోను జగపతి బాబు ఓ కామియో రోల్ పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కృష్ణమ్మ భక్తురాలు అనుష్క పై మనసుపడే మహరాజు పాత్రలో జగపతి బాబు నటించనున్నాడని చెబుతున్నారు. మహారాజు పాత్రలో జగపతి బాబు చాలా గొప్పగా కనిపించనున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే జగపతి బాబు, అనుష్క లపై ఓ సాంగ్ ని కూడా చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. హథీరాం బాబా జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో సౌరభ్‌ జైన్ వెంకటేశ్వర స్వామిగా కనిపించనుండగా.. విమలా రామన్, ప్రజ్ఞా జైస్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది.

2041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles