షాకింగ్ అవతారంలో ప్రైమ్ స్టార్

Thu,December 8, 2016 09:52 AM
jagapati babu in shocking avatar

హీరో నుండి విలన్ గా టర్న్ ఇచ్చాక జగపతి బాబు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని భాషలలో నటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వర్సటైల్ యాక్టర్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మన్యం పులి ఇటీవలే విడుదల కాగా, ఈ చిత్రం జగపతి బాబు క్రేజ్ ని మరింత పెంచింది. ఇక తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు ఓ సినిమాలో 60ఏళ్ళ వృద్దుడి పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. పటేల్ సర్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఒక ముసలి వ్యక్తికి మరియు గుడ్డి, చెవిటి మహిళ కు ఉన్న రిలేషన్ షిప్ నేపధ్యంలో తెరకెక్కనుందని చెబుతున్నారు. అయితే మూవీ లవర్స్ మరియు జగపతి బాబు అభిమానులు ఆ షాకింగ్ గెటప్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ డ్రామా ప్రాజెక్ట్ అమితాబ్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన బాలీవుడ్ ప్రాజెక్ట్ బ్లాక్ కి రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను యూనిట్ త్వరలోనే ప్రకటించనుందట.

2049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles