సైరాలో జగ్గూబాయ్ పాత్ర ఇలా ఉంటుందా ?

Sun,September 24, 2017 09:37 AM
సైరాలో జగ్గూబాయ్ పాత్ర ఇలా ఉంటుందా ?

మెగాస్టార్ చిరంజీవి క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ సైరా నరసింహరెడ్డి వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మూవీలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలు కనిపించనుండగా, మూవీపై భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే ఈ హీరోల పాత్రల గురించి ఒక్కో విషయం రివీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి.. సైరా నరసింహారెడ్డి పాత్రలో కనిపించనుండగా, విజయ్ సేతుపతి బ్రిటీష్ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా కనిపిస్తాడని సమాచారం.

ఇక హీరో నుండి టర్న్ తీసుకొని విలన్ గాను, సపోర్టింగ్ రోల్స్ లోను అదరగొడుతున్న జగపతి బాబు సైరాలో ముఖ్య పాత్ర పోషించనున్నాడు. చిరంజీవి తర్వాత అంతటి స్థాయి పాత్ర జగ్గూబాయ్ దే అంటున్నారు. నరసింహరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆయనని నమ్మించి బ్రిటీష్ వారికి పట్టించడానికి కారణమయ్యే వ్యక్తి పాత్రలో జగపతి కనిపించనున్నాడట. జగపతి లుక్ కూడా కొత్తగా ఉంటుందని సమాచారం. మరి సైరా సినిమాకి సంబంధించిన వస్తున్న వార్తలలో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. సైరా చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కథానాయికగా నయనతార నటించనుంది.

1372

More News

VIRAL NEWS