హీరోగా అల‌రించేందుకు సిద్ధ‌మైన జ‌గ్గూభాయ్

Sat,September 8, 2018 01:40 PM
Jagapathi Babu loos hero in next movie

మోస్ట్ హ్యాండ్సమ్ హీరో జగపతి బాబు పేరు చెప్పగానే అందరికీ ఓ సాఫ్ట్ హీరో ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా ట‌ర్న్ తీసుకొని ప్ర‌స్తుతం మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయ్యారు. తండ్రి పాత్ర‌లో, విల‌న్ పాత్ర‌లోను క‌నిపించి మెప్పిస్తున్నాడు. లెజెండ్ చిత్రంతో హీరో నుండి విల‌న్‌గా టర్న్ తీసుకున్న జ‌గ‌ప‌తి బాబు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించిన తానాజీ చిత్రంలో వారియ‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌తో ఫుల్ బిజీ అయిన జ‌గ‌ప‌తి బాబు అడ‌పాద‌డపా హీరోగా అల‌రిస్తున్నాడు. ఇటీవల పటేల్‌ సర్‌ సినిమాలో హీరోగా నటించిన జగ్గుభాయ్‌ త్వరలో ఓ బహుభాషా చిత్రంలో హీరోగా నటించనున్నాడట.

అన‍్బరసన్ అనే కొత్త ద‌ర్శ‌కుడు త్వ‌ర‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఇందులో జ‌గ్గూభాయ్ హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న‌తో పాటు అర్జున్‌, జాకీష్రాఫ్‌లు కూడా హీరోలుగా నటిస్తున్నారట. మరో కీలక పాత్రలో ఓ స్టార్‌ హీరో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వినాయ‌క చ‌వితి రోజున దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

2860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS