నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ యోగా పిక్ అదుర్స్!

Thu,November 23, 2017 03:38 PM
Jacqueline Fernandez yoga pic becomes meme and viral on social media

బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతున్నది. దానికి కారణం ఒక్కటంటె ఒక్కటే ఫోటో. అవును. ఆ ఫోటోతో ఇప్పుడు సోషల్ మీడియాలో జాక్వలైన్ మీదే డిబేట్. ఏముందయ్యా ఆ ఫోటోలో అంటే.. మీరు చూస్తున్నారుగా పైన ఫోటో.. అదే ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాను ఉర్రూతలూగిస్తున్నది.


అది ఓ యోగాసనం. ఆ యోగాసనాన్ని జాక్వలైన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసి యోగిని అన్ని క్యాప్సన్ పెట్టింది. ఇక అంతే.. ఆ ఫోటోను చూసి షాక్ అయిన నెటిజన్లు.. ఆ ఫోటోను ఓ మెమెగా క్రియేట్ చేశారు. జాక్వలైన్ యోగాసనం ఫోటోను మార్ఫింగ్ చేసి మెట్రో రైల్ బ్యాక్ గ్రౌండ్‌తో.. ట్రెయిన్‌లో సీటు దొరకక.. యోగా ట్రై చేస్తున్న జాక్వెలెన్.. అంటూ, మెట్రో రైల్ లో యోగాను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీలు అంటూ.. ఇంకా రకరకాలుగా మెమెను చేసి నెటిజన్లు వాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం దుమ్మురేపుతున్నది.
ఇక.. జాక్వెలైన్ యోగా స్టంట్ కు ఇంప్రెస్ అయినట్టున్నాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. అందుకే.. తన జుడ్వా2 మూవీ కోస్టార్ తో తను చేసిన ఫీటు కాకపోయినా.. ఇంకో స్టంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఈ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.

2692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS