లంక బాధితులని ఆదుకుందామ‌ని పిలుపునిచ్చిన‌ జాక్వెలీన్

Fri,May 3, 2019 01:18 PM
Jacqueline Fernandez Urges All to Help

ఏప్రిల్ 21 ఉదయం 8: 30 గంటల ప్రాంతంలో కొలంబో సహా పలు చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగ‌తి తెలిసిందే. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా హోటల్‌, సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌, కింగ్స్‌బరి హోటళ్లతో పాటు ప‌లు చోట్ల‌ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళ ఘ‌ట‌న‌లో 250కి పైగా మృత్యువాత ప‌డ్డారు. ఎందరో నిరాశ్ర‌యుల‌య్యారు. లంక బాధితుల‌ని ఆదుకునేందుకు కొన్ని స్వ‌చ్చంద సంస్థ‌ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. శ్రీలంకకి చెందిన జాక్వెలీన్ ఫెర్నాండేజ్ కూడా లంక బాధితులిన ఆదుకుందామ‌ని పిలుపునిచ్చింది.

వ‌రుస వీడియోల‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన జాక్వెలీన్ .. ఎవ‌రో దుర్మార్గులు చేసిన ప‌నికి ఎంతో మంది పిల్లలు, అమాయ‌క ప్ర‌జ‌లు బ‌ల‌య్యారు. ఎవ‌రో వ‌ల‌న ఇంత మంది బ‌ల‌వ్వ‌డం నాకు ఎంతో బాధ‌ని క‌లిగిస్తుంది. ఉగ్ర‌దాడుల‌ని ఎవ‌రు ముందుగా ప‌సిగ‌ట్ట‌లేరు కాదా, మ‌న‌మంతా ఒక్క‌టైతే గాయ‌ప‌డిన లంక‌ని తిరిగి మాములు స్థితికి తేగ‌లం. ట్రెయిల్ అనే స్వ‌చ్చంద సంస్థ‌తో నేను ఒప్పందం కుదుర్చుకున్నాను. కులాలు, మ‌తాలు అన్ని ప‌క్క‌న పెట్టి మీరు నాతో పాటు బాధితుల‌కి సాయం చేయండని జాక్వెలిన్ తెలిపింది. త‌న దేశ ప్ర‌జ‌ల‌ని ధైర్యంగా ఉండ‌మ‌ని కోరుతూ , పాజిటివ్‌గా అందరి క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని కోరింది జాక్వెలీన్ ఫెర్నాండేజ్.

View this post on Instagram

#uniteforsrilanka 🙏🏻 link in my bio

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

1289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles