'ఏక్‌..దో.. తీన్‌'కి శ్రీలంక బ్యూటీ స్టెప్పులు అదుర్స్‌

Sun,March 18, 2018 07:42 AM
Jacqueline Fernandez Gives an Edgy Makeover to Madhuri Dixit song

పాత పాటలంటే చాలామంది చెవికోసుకుంటారు. కొన్ని దశాబ్దాల కిందట వచ్చిన సినిమాల్లో పాటలు ఇప్పటికీ కొత్తగా, మధురంగా మాధుర్యాల్ని ఒలకబోస్తుంటాయి. అందుకే వాటిని కొన్ని సినిమాల్లో రీమిక్స్ కూడా చేసి చూపిస్తున్నారు. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ ఈ పోకడ ఉంది. దాదాపు 30 ఏళ్ల కిందట మాధురీ దీక్షిత్ డాన్స్ చేసిన వెరీ పాపులర్ సాంగ్ ను ఇప్పుడు రీమిక్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ మ‌రేదో కాదు బాలీవుడ్ హిట్ చిత్రం 'తేజాబ్'లోని "ఏక్..దో..తీన్.. అనే పాట‌. బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్‌కి ఆ ఒక్క పాటతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే పాటను టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా నటిస్తున్న బాఘీ 2 చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఆనాటి అందాల బొమ్మ మాధురీ దీక్షిత్ బేతాబ్ లో డాన్స్ చేసిన ఏక్ దో తీన్ పాటకు ఈ నాటి ముద్దుగుమ్మ,శ్రీలంక‌న్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులు వేస్తుంది. తాజాగా ఈ పాట‌కి సంబంధించి 25 సెక‌న్ల నిడివి గ‌ల వీడియో విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. రీమిక్స్ సాంగ్‌కి స‌రోజ్ ఖాన్‌, గ‌ణేష్ ఆచార్య‌, అహ్మ‌ద్ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా పని చేస్తున్నారు. ఆ ఎవర్ గ్రీన్ హిట్ పాటకు అప్పుడు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ మ్యూజిక్ అందించారు. "చోలీ కే పీచే క్యా హై..." పాట నుండి సరోజ్‌కి సహాయకుడిగా పనిచేసిన అహ్మద్ ఖాన్ బాఘీ 2 సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే.. ఒరిజినల్ "ఏక్..దో..తీన్.."పాటలో బ్యాక్ అప్ డాన్సర్లలో ఒకరైన గణేశ్ ఆచార్య ఈ రీమిక్స్ పాటకు డాన్స్ డైరెక్టర్. జాక్వైల‌న్ పింక్ క‌ల‌ర్ డ్రెస్‌ని మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేశారు. మార్చి 30న బాఘీ చిత్రం విడుద‌ల చేయ‌నున్నారు.2359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles