జాకీచాన్ ని వరించిన ఆస్కార్ అవార్డ్

Tue,November 15, 2016 07:24 AM

అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ ని గెలుచుకోవాలనేది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నటుడి కల. తరతరాలుగా ఈ ఆస్కార్ అవార్డ్ ని దక్కించుకోవాలని ఎందరో కృషి చేశారు. ఆస్కార్ దక్కితే అమృతం తాగినంత ఆనందంగా ఫీలవుతారు మన సినీ నటీనటులు. అయితే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న జాకీచాన్ ఎట్టకేలకు ఆస్కార్ అవార్డ్ ని దక్కించుకొని తన కలను సాకారం చేసుకున్నాడు . 62 ఏళ్ళ జాకీచాన్ తన 56 ఏళ్ళ సినీ కెరియర్ లో 200కి పైగా చిత్రాలలో నటించాడు. లెక్కకు మించి అవార్డులు, ఎందరో ప్రముఖులు ప్రశంసలు జాకీ చాన్ సొంతం. జాకీ చాన్ అంటే చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వాళ్ళకు కూడా సుపరిచితం. ఫైట్స్ కి ఐకాన్ గా మారిన జాకీచాన్ ఇప్పటికి తన దైన స్టైల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అయితే జాకీచాన్ ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న ఎనిమిదవ గవర్నెన్స్ అవార్డ్ లలో భాగంగా ఈ కుంగ్ ఫూ స్టార్ కి ఆస్కార్ అవార్డ్ ఇచ్చి సత్కరించారు. ఈ అవార్డ్ అందుకున్న జాకీచాన్ ఆనందంతో ఉద్వేగభరితుడయ్యాడు. ఇక జాకీచాన్ కి ఆస్కార్ దక్కిందన్న విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జాకీచాన్ ప్రస్తుతం కుంగ్ ఫూ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోండగా, ఇందులో ఇండియన్ యాక్టర్స్ సోనూసూద్, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.1877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles