మేకప్‌ వేసుకున్న విజయశాంతి..ఫొటో షేర్‌ చేసిన డైరెక్టర్‌

Mon,August 12, 2019 07:08 PM
Its makeup time for Vijayashanti anil Ravipudi shares a pic


90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజయశాంతి సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి, మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం కోసం విజయ శాంతి మేకప్ వేసుకున్న విషయాన్ని అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

‘13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు మేకప్‌ వేసుకున్నారు. అదే క్రమశిక్షణ, అదే డైనమిజమ్‌. ఎలాంటి మార్పు లేదు..విజయశాంతిగారికి స్వాగతం’ అంటూ మేకప్‌ వేసుకుంటున్న స్టిల్‌ను అనిల్‌ రావిపూడి షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు.

విజయశాంతి 2006లో వచ్చిన నాయుడమ్మ చిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఈ సినిమాలో మహేశ్‌ తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. కశ్మీర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. మహేశ్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదలైన మేజర్‌ అజయ్‌ కృష్ణ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.2691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles