ఫ‌న్ ఎప్ప‌టికి ఎండ్ కాదు అంటున్న అక్ష‌య్ కుమార్

Tue,November 20, 2018 02:03 PM
Its A Wrap Up For Akshay Kumar Housefull 4

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన 2.0 చిత్రం నవంబ‌ర్ 29న విడుద‌ల కానుండ‌గా, ఆయ‌న న‌టిస్తున్న హౌజ్‌ఫుల్ సిరీస్‌లో నాలుగో పార్ట్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని అక్ష‌య్ టీం స‌భ్యులంద‌రితో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఫ‌న్ ఎప్ప‌టికి ఎండ్ కాదు, 2019లో మ‌ళ్ళీ క‌లుద్దాం అని కామెంట్ పెట్టాడు. ఈ చిత్రాన్ని మొద‌ట సాజిద్ ఖాన్ తెర‌కెక్కించ‌గా ఆయ‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌ల వ‌ల‌న ఆయ‌న స్థానంలో ఫ‌హ‌ద్ సంజీని ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. ఇక నానా ప‌టేక‌ర్ స్థానంలోపై కూడా లైంగిక ఆరోప‌ణ‌లు రాగా ఆయ‌న స్థానంలో రానాని తీసుకున్నారు. కృతి స‌నన్, రితేష్ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే, బాబి డియోల్‌, కృతి క‌ర్భందా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ విజ‌యం సాధిస్తుందని టీం భావిస్తుంది.827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS