HomeLATEST NEWSIts a wrap for Maharshi

మ‌హ‌ర్షి చిత్ర షూటింగ్ పూర్తి.. మే 9న విడుద‌ల‌

Published: Thu,April 18, 2019 08:33 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేసి మే 9న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మ‌హేష్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్రంలో మ‌హేష్ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రంగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.
1328
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology