కర్ణాటక ఎన్నికల డ్రామాపై రజనీకాంత్ ఏమన్నారంటే..

Sun,May 20, 2018 01:53 PM
Its a victory of democracy in Karnataka says Rajnikanth

చెన్నై: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత అధికారం కోసం బీజేపీ.. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొన్ని రోజులుగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని మరింత రక్తికట్టించాయి. చివరికి అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అధికారంతోపాటు తమ పార్టీ పరువు, ప్రతిష్టను కూడా పోగొట్టుకుంది.


ఈ డ్రామాపై తమిళ సూపర్‌స్టార్, త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్ స్పందించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచిందని ఆయన అన్నారు. బల నిరూపణ కోసం బీజేపీ సమయం అడగటం, దానికి గవర్నర్ 15 రోజుల సమయం ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. సుప్రీంకోర్టు సరైన సమయంలో స్పందించినందుకు కృతజ్ఞతలు. ఇవాళ కోర్టు ఆదేశాల వల్లే ప్రజాస్వామ్యం గెలిచింది అని రజనీకాంత్ అన్నారు. బీజేపీకి కాస్త అనుకూలుడిగా పేరున్న రజనీ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతున్నది.
ఇక 2019 ఎన్నికల్లో తాము పోటీ చేస్తామా లేదా అన్నది ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాతే నిర్ణయిస్తామని, ఇప్పుడే దానిపై స్పందించడం తొందరపాటు అవుతుందని రజనీ అన్నారు. పార్టీని ఇంకా ఆవిష్కరించనేలేదు. కానీ మేం దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఇక పొత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం కూడా సరికాదు అని ఆయన స్పష్టంచేశారు. ఇవాళ చెన్నైలో తన ఇంట్లో పలువురు మహిళలతో రజనీకాంత్ సమావేశమయ్యారు.

5435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles