ఐటెం సాంగ్‌తో దుమ్ము రేపిన దీప్తి, సామ్రాట్‌

Thu,July 19, 2018 08:36 AM
item song in bigg boss house

బిగ్ బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా మంగ‌ళ‌వారం ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ షూటింగ్ ఘ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ అమిత్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ దీప్తి, కెమెరా మెన్ రోల్ రైడాలు ఆర్టిస్టుల‌తో న‌వ‌ర‌సాలు పండిస్తూ షూటింగ్ చేశారు. మ‌ధ్య మధ్య‌లో ప్రొడ‌క్ష‌న్ చీఫ్‌గా ఉన్న బాబు గోగోనేని నన్ను హీరోగా పెట్టుకోండని డైరెక్ట‌ర్‌కి టీం చెప్ప‌డం, హీరోల‌పై స‌ర‌దా కామెంట్స్ చేయడం వంటి సంఘ‌ట‌న‌లు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించాయి. క‌థ‌లో భాగంగా బుధ‌వారం మొద‌లైన ‘బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ మూవీ’ అనే ఎనర్జిటిక్ టాస్క్‌లో మొద‌ట యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించారు . సినిమాకి ల‌ఫ్పాంగిరిగిట్టా అనే కొత్త టైటిల్ పెట్టి చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు.

బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 39కి వచ్చేసరికి రంజుగా మారింది. క‌థ‌లో భాగంగా కౌశ‌ల్, నందిని మ‌ధ్య రొమాన్స్‌, త‌నీష్‌, సామ్రాట్‌ల మ‌ధ్య యాక్ష‌న్ సీన్స్ త‌దిత‌ర స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. కొన్ని స‌న్నివేశాల‌ని కామెడీగా తెర‌కెక్కించి ఫ‌న్ క్రియేట్ చేశారు. బాత్‌రూంలో ఉన్న కౌశ‌ల్.. నందిని కోసం బ‌య‌ట‌కు రావ‌డం, ఆమె కోసం ఏమైన త్యాగం చేస్తాన‌ని అన‌డం ఇలాంటి ఆస‌క్తిక‌ర‌ స‌న్నివేశాల నడుమ షూటింగ్ జ‌రిగింది. ఆ త‌ర్వాత ఐటెం సాంగ్‌ని చిత్రీక‌రించారు. తేజ‌స్వీ కొరియోగ్రఫీలో రూపొందిన రింగ రింగ అనే ఐటెం సాంగ్‌కి దీప్తి సున‌య‌న‌, సామ్రాట్‌లు అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సాంగ్ సినిమాకే స్పెష‌ల్ హైలైట్ అవుతుంద‌ని టీం బావించింది.

ఐటెం సాంగ్‌లో దీప్తి సున‌య‌న‌, సామ్రాట్‌ కాస్టూమ్స్ అదిరిపోగా, వారు చేసిన స్టెప్పుల‌కి బిగ్ బాస్ హౌజ్ షేక్ అయింది. సాంగ్ చివ‌ర‌లో దీప్తి సున‌య‌న‌.. సామ్రాట్‌కి ఓ ముద్దు ఇవ్వ‌డం హైలైట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత తనీష్, సామ్రాట్‌ల మధ్య యాక్షన్ సీన్‌తో సినిమా షూట్ ముగిసిందని.. డైరెక్టర్ అమిత్ ఎడిటింగ్ కోసం బిగ్ బాస్‌కి పంపించారు. త్వరలో ఈ సినిమా ఎలా వచ్చిందో ప్రివ్యూ చూపించాలని అమిత్ కోరడంతో ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ సినిమా టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ గురించి దీప్తి మాట్లాడుతూ.. తాను ఫుల్‌గా ఎంజాయ్ చేసిన‌ట్టు తెలిపింది. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ త‌మ‌కు మంచి మార్కులు ఇస్తాడ‌ని తనీష్ అన్నాడు.

ఈ వారం ఎలిమినేష‌న్ కోసం ఐదుగురు ఇంటి స‌భ్యులు నామినేట్ కాగా అందులో తేజ‌స్వీ, దీప్తి, రోల్ రైడా, సామ్రాట్‌, త‌నీష్‌లు ఉన్నారు. వీరిలో తేజ‌స్వీ లేదా దీప్తిల‌లో ఒక‌రు ఎలిమినేట్ కావొచ్చ‌ని కౌశ‌ల్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేయ‌గా, గీతా మాధురి ..రోల్ రైడా, సామ్రాట్, తనీష్‌లలో ఒకరు ఎలిమినేట్ కావొచ్చని అభిప్రాయపడింది. ఆ త‌ర్వాత బిగ్ బాస్ టాస్క్‌లో జరిగిన ఫ‌న్ ఇన్సిడెంట్స్ గురించి బాబు గోగినేని, గ‌ణేష్‌, తేజ‌స్వీని ముచ్చ‌టించుకున్నారు. మీరు చేసిన‌వ‌న్ని మేం చిన్న‌ప్పుడే చేసామంటూ బాబు.. తేజ‌స్వీకి చెబుతాడు. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే అది సీరియ‌ల్ క‌థలా ఉందని, డైరెక్ట‌ర్ టీం చెప్పిన స్టోరీ బిగ్ బాస్‌కి కూడా అర్ధం కాకపోయి ఉండ‌వ‌చ్చు అంటూ తేజు అంద‌రి మొహంలో న‌వ్వులు విర‌బూసేలా చేసింది. ఈ రోజు బిగ్ బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో ఎవ‌రెవ‌రికి ఎన్ని పాయింట్స్ వ‌చ్చాయి, కెప్టెన్‌గా నామినేట్ కావ‌డానికి ఏమేం చేయాలి త‌దిత‌ర వివరాల‌ని నేటి ఎపిసోడ్‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

4377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles