పొరపాటున లైక్ చేశాను: అక్షయ్‌కుమార్

Mon,December 16, 2019 04:00 PM

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల విద్యార్థులు జామియా వర్సిటీ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. అయితే జామియా వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన వీడియోను బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ లైక్ చేశాడు. హింసను ప్రేరేపించేలా ఉన్న వీడియోను గమనించకుండా లైక్ చేయడంతో..దీనిపై నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో వెంటనే అక్షయ్ వీడియోను అన్‌లైక్ చేసి..పొరపాటున ఇలా జరిగిందని ట్వీట్ చేశాడు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదని అక్షయ్ స్పష్టం చేశాడు. అక్షయ్ లైక్ చేసిన వెంటనే ఈ వీడియోకు అరగంటలోనే 9000 లైక్స్ వచ్చాయి.5465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles