హీరో నాని కార్యాల‌యంలోను కొన‌సాగుతున్న ఐటీ సోదాలు

Wed,November 20, 2019 12:19 PM

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన నాని ప్ర‌స్తుతం హీరోగా, నిర్మాత‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. హీరోగా ప్ర‌స్తుతం వి అనే సినిమా చేస్తున్న నాని వాల్ పోస్ట‌ర్ సినిమాస్ బేన‌ర్‌పై సినిమాలు నిర్మిస్తున్నాడు. త‌న నిర్మాణంలో తొలి సారిగా అ అనే చిత్రాన్ని నిర్మించారు నాని. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఫ‌ల‌క్‌నామ్ దాస్ ఫేమ్ విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొంద‌నున్న హిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. చిల‌సౌ ఫేమ్ రుహానీ శ‌ర్మ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించ‌నున్నారు. అయితే ఈ రోజు ఉద‌యం నుండి సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప‌లువురు నిర్మాత‌ల ఇళ్ళు, ఆఫీసుల‌లో ఐటీ సోదాలు చేస్తున్న క్ర‌మంలో నాని కార్యాల‌యంలోను ఐటీ అధికారులు సోదా చేపట్టారు. నిర్మాణ రంగానికి సంబంధించి పలు డాక్యుమెంట్లు ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఇల్లు, ఆఫీసుల‌లోను సోదాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇలా వ‌రుస ఐటీ దాడుల‌తో టాలీవుడ్ నిర్మాత‌లు కంగారుప‌డుతున్నారు.

1545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles