జవాన్ల మరణం వ్యక్తిగతంగా తీరని లోటు: విక్కీ కౌశల్

Sun,February 17, 2019 02:35 PM
It feels like a personal loss Vicky Kaushal on attack

జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఎవరూ పూడ్చలేని నష్టమని యురి చిత్ర నటుడు విక్కీ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో జవాన్ల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నాడు. విక్కీ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ..ఉగ్రవాద సమస్యకు చెక్ పెట్టేలా వారికి తగిన సమాధానమివ్వాలని అభిప్రాయపడ్డాడు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి..జవాన్ల కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని, జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయాలని కోరాడు. అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా కూడా ప్రజలంతా మద్దతుగా నిలబడాల్సిన అవసరముందన్నారు.

1751
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles