‘జై సింహా’ నిర్మాత ఆఫీసులో ఐటీ సోదాలు

Wed,January 17, 2018 02:04 PM
‘జై సింహా’ నిర్మాత ఆఫీసులో ఐటీ సోదాలు


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై..కలెక్షన్లను రాబడుతున్నది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ జై సింహా సినిమా నిర్మాత సి కల్యాణ్ కార్యాలయంపై దాడులు చేపట్టింది. కృష్ణానగర్‌లోని సి కల్యాణ్ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సి కల్యాణ్ ఆదాయపు పన్ను సరిగ్గా కట్టారా..? లేదా..? అన్న విషయంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ అధికారులు సి కల్యాణ్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జై సింహా మూవీ తొలి వారంలోనే రూ.25 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

1841

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018