బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ఉస్తాద్ ఇస్మార్ట్ శంక‌ర్

Sat,July 27, 2019 11:23 AM
iSmartShankar Nine Days collections is  Rs 63 Crore Gross

ఉస్తాద్ ఇస్మార్ట్ శంక‌ర్.. ఈ పేరుని రామ్ త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్ పేరుగా మార్చుకున్నాడంటే దీనికి ఎంత‌గా క‌నెక్ట్ అయ్యాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇన్నాళ్ళుగా చాలా సాఫ్ట్‌గా క‌నిపించిన రామ్ తొలి సారి మాస్ లుక్‌లో తెలంగాణ యాస‌తో అద‌రగొట్టాడు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంక‌ర్.. మార్ ముంత చోడ్ చింత అంటూ రామ్ చెప్పిన డైలాగ్స్ మాస్‌కి మాంచి కిక్ ఇచ్చాయి. తొలి రోజు నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. జూలై 18న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికి మంచి వ‌సూళ్ళ‌తో దూసుకెళుతుంది . తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.56 కోట్లు వసూలు చేసింది . 8 రోజుల్లో రూ.61 కోట్లు రాబట్టింది. తాజాగా 9 రోజుల‌లో 63 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు సాధించిందని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. రీసెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రం విడుద‌ల కాగా, ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ హ‌వా కొద్ది రోజుల వ‌ర‌కు ఇలానే ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ స్టైలిష్ టేకింగ్, న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్‌ల గ్లామ‌ర్ సినిమాకి చాలా ప్ల‌స్ అయింది. ఈ చిత్రంతో రామ్ త‌న కెరియ‌ర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన‌ట్టుగా తెలుస్తుంది.

1802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles