రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'ఇస్మార్ట్ శంకర్' టీజ‌ర్ విడుద‌ల‌

Wed,May 15, 2019 10:30 AM

యువ హీరో రామ్ పోతినేని .. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌న‌కి మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని స్ట్రాంగ్‌గా న‌మ్ముతున్నాడు రామ్‌. అయితే సినిమా కోసం రామ్ భారీ కండ‌లు కూడా పెంచాడు. ఈ రోజు రామ్ బ‌ర్త్‌డే ని పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మితో పాటు చిత్ర బృందానికి సంబంధించిన ప‌లువురు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేశారు. చిత్ర టీం రామ్ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రామ్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకునేలా ఉంది. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం రామ్‌తో పాటు పూరీకి మంచి విజ‌యం అందిస్తుంద‌ని సినీ ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.


సరికొత్త‌ మాడ్యులేషన్ లో హిందీ పదాలలో తనదైన శైలి మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు రామ్‌. అలాగే టీజ‌ర్‌లో ప్ర‌ధానంగా ‘నేపధ్య సంగీతంతో పాటు.. బ్యాగ్రౌండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరో స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.
1609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles