గ్రాండ్‌గా లాంచ్ అయిన ఇస్మార్ట్ శంక‌ర్.. రేప‌టి నుండి షూటింగ్

Wed,January 23, 2019 01:19 PM

పూరీ జ‌గ‌న్నాథ్‌- రామ్ పోతినేని కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఇప్ప‌టికే చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ మాంచి మాస్ లుక్‌లో క‌నిపించాడు. నేడు చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, రేప‌టి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. లాంచింగ్ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. చార్మీ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించ‌గా, స్ర‌వంతి ర‌వి కిషోర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాలో రామ్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. కొన్నాళ్ళుగా సరైన హిట్స్ లేక ఇబ్బందిప‌డుత‌న్న రామ్‌, పూరీలు ఈ సినిమాతో మంచి విజ‌యం త‌మ ఖాతాలో వేసుకోవాల‌నే క‌సితో ఉన్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడిగానే కాదు నిర్మాత‌గాను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. చార్మీ స‌హానిర్మాత‌గా ఉన్నారు. అను ఎమ్మాన్యుయేల్ తో పాటు మ‌రో భామ‌ని ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. మాస్ కంటెంట్‌తో పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం.
2648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles