ఈషా, నీతా అంబానీ దాండియా డ్రెస్సులు అదుర్స్..!

Sun,November 18, 2018 03:46 PM
Isha Ambani Mother Nita Dress Up For Dandiya Wedding Celebrations On

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లి హడావుడి మొదలైంది. పెళ్లికి ఇంకా 25 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ముకేశ్ ఇంట్లో పెళ్లి సంబురాలు జోరందుకున్నాయి. డిసెంబర్ 12న ఈషా పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్‌ను ఈషా పెళ్లి చేసుకోబోతున్నది. గత సెప్టెంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో ఈషా, ఆనంద్ పిరమాల్ ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ కూడా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయిన ఆ సెరమనీ మూడు రోజుల పాటు లేక్ కోమోలో జరిగింది. లేక్ కోమో అంటే గుర్తొచ్చింది.. మన బాలీవుడ్ క్యూట్ కపుల్ దీప్‌వీర్ పెళ్లి కూడా అక్కడే జరిగింది.


సరే.. అసలు విషయానికి వస్తే.. ఇవాళ రాత్రి ముకేశ్ ఇంట్లో దాండియా వేడుకలు జరగనున్నాయట. ఆ వేడుకల కోసం సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్.. దాండియా కోసం రెడీ అయిన నీతా అంబానీ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈషా మాత్రం చేతితో ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన లెహంగాను వేసుకొని ఫోటోలకు పోజిచ్చింది. ఈషా ఫోటోలను ఈషా పెళ్లి డ్రెస్సుల డిజైనర్ సందీప్ ఖోస్లా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

2474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles