బెల్జియం యువ‌తితో విజ‌య్ దేవ‌ర‌కొండ చెట్టాప‌ట్టాలు..!

Thu,September 20, 2018 01:34 PM
Is Virginie Vijay Deverakondas Girlfriend

యంగ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస హిట్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాలంటే అభిమానుల‌లో ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. రీసెంట్‌గా గీత గోవిందం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విజ‌య్ ప్ర‌స్తుతం నోటా, డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రాలు చేస్తున్నాడు. అయితే ఈ కుర్ర హీరో బెల్జియం యువ‌తితో చెట్ట‌ప‌ట్టాలు వేస్తున్న ఫోటోల‌తో పాటు రొమాంటిక్‌గా దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పెళ్ళి చూపులు చిత్రం నుండే బెల్జియం యువ‌తి వ‌ర్జినీతో విజ‌య్ కి ప‌రిచ‌యం ఉంద‌ని తెలుస్తుండ‌గా, తాజాగా విజ‌య్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీతో వ‌ర్జినీ క‌లిసి ఉన్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి. దీనిపై అభిమానులు ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. విజ‌య్ ఫ్యామిలీతో కూడా ఆ యువ‌తి క్లోజ్‌గా ఉండ‌డంతో ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉంటుంద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. మ‌రి దీనిపై విజ‌య్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

7045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles