సినిమాల్లోకి విరాట్ కోహ్లి.. ఇదీ ఫస్ట్ లుక్ పోస్టర్!

Fri,September 21, 2018 12:33 PM
Is Virat Kohli venturing into movies the latest tweet suggested so

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ రూట్‌లోనే బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడా? అతడు తాజాగా చేసిన ట్వీట్ ఈ కొత్త అనుమానాలకు తావిస్తున్నది. ఏదో మూవీ పోస్టర్‌లాగా ఉన్న ఆ ఫొటోలో కోహ్లి ఓ సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇప్పుడీ ఫొటోనే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఏషియకప్‌కు దూరంగా ఉన్న విరాట్.. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ పోస్టర్‌పై ఇంట్రడ్యూసింగ్ విరాట్ కోహ్లి.. ట్రైలర్ ద మూవీ అని రాసి ఉండటం విశేషం. ఇక ఈ ఫొటోని షేర్ చేస్తూ పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను అని కోహ్లి కామెంట్ చేశాడు. కోహ్లి నిజంగానే సినిమాల్లోకి వస్తున్నాడంటే అభిమానులకు పండుగే. నిజానికి అతను కూడా హీరో మెటీరియలే. ఆటతోనే కాదు లుక్స్‌లోనే విరాట్ అదరగొడతాడు. మొన్నా మధ్య భార్య అనుష్క శర్మతో కలిసి మాన్యవర్ యాడ్‌లోనూ అతడు నటించాడు.


3854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles