సూర్య ‘ఎన్‌జీకే’ విడుదల వాయిదా..?

Mon,February 18, 2019 06:40 PM
Is surya NGK Movie Postponed again?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నటిస్తోన్న చిత్రం ‘ఎన్‌జీకే’ . సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ కు అద్భుతమైన స్పందన వస్తోంది. సోషల్‌ మీడియాలో ఎన్‌జీకే టీజర్‌కు 8 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఎన్‌జీకే ను తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ రెండో వారంలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఆలస్యం కారణంగా ఎన్‌జీకే విడుదలను మే చివరి వారానికి వాయిదా వేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకుడు. సూర్యకు ఈ చిత్రం 36వది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

1485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles