బిగ్ బాస్3 హోస్ట్‌గా సీనియ‌ర్ హీరో..!

Tue,March 19, 2019 11:25 AM
is nagarjuna host telugu bigg boss 3

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులోను మంచి హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, హోస్ట్ ఎవ‌రు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ అన్నీ తానై న‌డిపించి మంచి స‌క్సెస్ చేయ‌డంతో మూడో సీజ‌న్‌కి కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావించారట‌. కాని ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌తో క్ష‌ణం తీరిక లేని స‌మ‌యం గడుపుతున్నాడు. రాజ‌మౌళి సినిమా అంటే రిలీజ్ వ‌రకు కంప్లీట్‌గా ఆ ప్రాజెక్ట్‌కి లాక్ అవ్వాల్సిందే. మ‌రి ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్‌3ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డం అసాధ్యం.

బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్ రేస్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవ‌డంతో ఆయన స్థానంలో ఎవ‌రిని తీసుకోవాలా అని నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. నానినే కొన‌సాగిద్దామంటే రెండో సీజ‌న్‌కి వ‌చ్చిన నెగెటివ్ ఇంపాక్ట్ మూడో సీజ‌న్‌పైన ప‌డుతుందేమోన‌ని మా యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌. ఇక మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే వారికి ఉన్న ఏకైక ఆప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్ట్ అనుభవాన్ని బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలోను ఉప‌యోగించి షోని మంచి హిట్ చేస్తార‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం మొద‌లు పెట్టార‌ని త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంద‌ని టాక్. మ‌రోవైపు నాగ్ త్వ‌ర‌లో మ‌న్మ‌థుడు 2 చిత్రంతో పాటు సోగ్గాడే చిన్ని నాయ‌న సీక్వెల్ చేయ‌నున్నాడు. ఈ రెండు అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించ‌నుండ‌గా, ఎప్ప‌టి నుండి సెట్స్ పైకి తీసుకెళ‌తారో చూడాలి.

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్... సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్‌గా 70 రోజుల పాటు 14 మంది సెలబ్రిటీలతో సంద‌డిగా సాగింది. ఇంత‌క‌ముందెన్న‌డూ లేనంత రేటింగ్స్ ఈ కార్య‌క్ర‌మం రాబ‌ట్టింది. ఈ సీజ‌న్‌లో శివ‌బాలాజీ విజేత‌గా నిలిచారు. 2017 జూలై 16న ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఇక రెండో సీజ‌న్ నాని హోస్ట్‌గా దాదాపు 113 రోజుల పాటు 18 మంది సెల‌బ్రిటీల‌తో సాగింది. 2018 జూన్ 10న సీజ‌న్ 2 స్టార్ట్ చేశారు. ఈ సీజ‌న్‌లో కౌశ‌ల్ విజేత‌గా నిలిచాడు. మ‌రి మూడో సీజ‌న్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది, హోస్ట్‌గా ఎవ‌రు ఉంటారు, ఎంత మంది సెల‌బ్రిటీలు ఇందులో పాల్గొంటారు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

3736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles