మహేశ్‌తో సీక్వెల్‌కు కొరటాల ప్లాన్..?

Mon,April 23, 2018 04:45 PM
Is koratala shiva plans to BAN Sequel ?


హైదరాబాద్ : టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సామాజిక సందేశంతో వచ్చిన ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న డైరెక్టర్ కొరటాల 2 ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. దేశం రాజకీయ మార్పును కోరుకుంటుందని, సీఎం భరత్ పాత్ర ఆ మార్పు కోసం ముందుకెళ్లేలా ఉంటుందని చెప్పిన శివ..ఈ మూవీ సీక్వెల్ వెనుక ఉన్న మెయిన్ కథ ఈ దిశగానే ఉంటుందని తెలిపాడు.

తాజా కామెంట్స్‌తో భరత్ అనే నేను మూవీ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు శివ. ఇక మరో ఆసక్తికరమైన విషయమేంటంటే భరత్ అనే నేను చిత్రాన్ని హిందీతోపాటు మిగతా భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ భారతీయుడికి రాజకీయ సందేశాన్ని చేరవేసేలా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ సినిమా సీక్వెల్‌పై క్లారిటీ వస్తే మహేశ్ అభిమానులకు ఇక పండగే అని చెప్పొచ్చు.

3734
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles