నానితో సినిమాకు కొరటాల ప్లాన్..?

Wed,May 16, 2018 05:46 PM
Is koratala plans a movie with nani ?


టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు న్యాచురల్ స్టార్ నాని కూడా ‘కృష్ణార్జున యుద్ధం’ సక్సెస్‌తో ఫుల్‌జోష్‌మీదున్నాడు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించబోతున్నారన్న వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. కొరటాల, నాని ఇటీవలే ఓ సినిమా సెట్స్‌లో కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి సినిమాకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ వీరిద్దరి కాంబో సెట్ అయితే..ఈ చిత్రాన్ని కొరటాల స్నేహితుడు సుధాకర్ నిర్మించనున్నారట. నాని, కొరటాల సినిమాకు సంబంధించి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

1828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles