క్యాన్సర్‌ను జయించి.. మళ్లీ సినిమాల్లో..

Sat,March 16, 2019 06:39 PM
Irrfan Khan After Battling Cancer Reportedly Resumes Work

బాలీవుడ్ ఇండస్ట్రీని క్యాన్సర్ భూతం భయపెడుతోంది. ఇప్పటికే చాలామంది నటులు క్యాన్సర్ బారిన పడి ట్రీట్‌మెంట్ తీసుకొని మృత్యువును జయించారు. అయితే.. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం మార్చిలో ఆయనకు న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ సోకినట్లు తెలిసింది. దాని కంటే నాలుగు నెలల ముందే అరుదైన క్యాన్సర్ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆయన ట్రీట్‌మెంట్ తీసుకోవడం ప్రారంభించారు. ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లారు. ట్రీట్‌మెంట్ మధ్యలో రెండుమూడు సార్లు ఇండియాకు వచ్చి వెళ్లారు ఇర్ఫాన్. ట్రీట్‌మెంట్ మొత్తం పూర్తయ్యాక ఆయన ఫిబ్రవరి 2019లో ఇండియాకు తిరిగొచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారట. హిందీ మీడియం సీక్వెల్‌లో ఇర్ఫాన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.

హిందీ మీడియం2 సినిమా గురించి మాట్లాడటం కోసం దినేశ్ విజాన్ ఆఫీసుకు ఇటీవలే ఇర్ఫాన్ వెళ్లారు. తన కారులో విజాన్ ఆఫీసుకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు ఇర్ఫాన్. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉన్నారు. తనకు క్యాన్సర్ సోకకముందే హిందీ మీడియం2 తో పాటు మరికొన్ని సినిమాలకు ఇర్ఫాన్ సైన్ చేశారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న‌ స‌మ‌యంలో బ్రేక్ ఇచ్చిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసే పనిలో పడ్డారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఇర్ఫాన్ నటించిన బాలీవుడ్ సినిమాలు బ్లాక్ మెయిల్, కార్వాన్, హాలీవుడ్ సినిమా పజిల్ రిలీజయ్యాయి.

8738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles