కోలుకుంటున్న ఇర్ఫాన్‌..ఇండియాలో దీపావ‌ళి వేడుక‌లు

Thu,October 25, 2018 12:10 PM
irrfan health is in normal stage

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మార్చి నెలలో తాను న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు ట్విట్టర్లో ప్రకటించడంతో ఇటు అభిమానులు, అటు సెలబ్రిటీలు షాక్‌లో పడ్డారు. ఆ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని, తనకి సోకిన వ్యాధిపై లేనిపోని పుకార్లు చేయొద్దని అప్ప‌ట్లో అతడు కోరాడు.అయితే కొన్నాళ్ళుగా విదేశాల‌లో చికిత్స పొందుతున్న ఇర్ఫాన్ ప్ర‌స్తుతం కోలుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే ఆయ‌న డిశ్చార్జ్ కానుండ‌గా, దీపావ‌ళి వ‌రకు భార‌త్‌కి తిరిగి రానున్నార‌ట‌. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ జ‌రుపుకోనున్నాడ‌ట‌. కొన్నాళ్ళ విశ్రాంతి త‌ర్వాత హిందీ మీడియం సినిమా సీక్వెల్ కూడా చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఇర్ఫాన్ ఆరోగ్యం కోలుకుంటుంద‌ని , త్వ‌ర‌లో డిశ్చార్జ కానున్నాడ‌ని తెలుసుకున్న అభిమానులు దీపావ‌ళికి వారం ముందుగానే పండుగ చేసుకుంటున్నారు.

1843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles