విక్రమ్‌తో కలిసి నటించనున్న మాజీ క్రికెటర్ ఇర్ఫాన్..

Tue,October 15, 2019 11:02 AM

హైదరాబాద్: ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినిమాల్లో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫాన్ స్వయంగా తానే ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. భారత విజయాల్లో అద్భుత పాత్ర పోషించిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్, టెస్టుల్లో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఇర్ఫాన్ ప్రస్తుతం ఇండియా, సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో భాగంగా ఎక్స్‌పర్ట్ ప్యానెల్ సభ్యుడిగా ఉన్నారు. త్వరలో చియాన్ విక్రమ్ హీరోగా నటించే సినిమాలో తాను నటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో తను చేసే పాత్ర గురించి పఠాన్ ఎలాంటి సమాచారమివ్వలేదు. కొత్త సవాల్‌ను స్వీకరించడానికి ఎదురుచూస్తున్నట్లు ఈ ఫాస్ట్ బౌలర్ తెలిపాడు.929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles