'సూర్య‌కాంతం' నుండి ఇంతేనా ఇంతేనా లిరిక‌ల్ సాంగ్

Wed,February 13, 2019 08:16 AM
Inthena Inthena Lyrical Song from Suryakantam

నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం సూర్యకాంతం. వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిత్రంలో స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు, ‘ఈ మాయ పేరేమిటో’ ఫేమ్ రాహుల్ విజయ్ క‌థానాయ‌కుడిగా నటించారు. ఆయ‌న స‌ర‌స‌న నిహారిక‌, ప‌ర్లీన్ బ‌సానియా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన చిత్ర టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.ఇక తాజాగా ఇంతేగా ఇంతేగా అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. కృష్ణ‌కాంత్ ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. సిద్ శ్రీరామ్ ఈ మ‌ధ్య కాలంలో పాడిన పాట‌ల‌న్నింటికి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌గా, ఇప్పుడు ఈ పాట సూప‌ర్ హిట్ అవుతుంద‌ని టీం అంటుంది. మార్క్ కె రాబిన్ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌ని మీరు చూసి ఎంజాయ్ చేయండి.

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles