ఏప్రిల్, మే నెలలో సల్మాన్ సందడి

Fri,April 14, 2017 04:47 PM
interesting upadate about Tubelight

కబీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ హిట్ కాంబినేషన్‌లో ట్యూబ్‌లైట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భజరంగీభాయ్ జాన్, ఏక్తా టైగర్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. దీంతో ట్యూబ్ లైట్ మూవీపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీ త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కబీర్‌ఖాన్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అభిమానులందరు చిత్ర టీజర్, ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర టీజర్ ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసి, మేలో ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టు దర్శకుడు తెలిపాడు. ఇక చిత్రాన్ని ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. ట్యూబ్‌లైట్ మూవీని జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లడక్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చిత్రీకరించారు. ఈ మూవీలో చైనీస్ హీరోయిన్ జూ జూ సల్మాన్‌కు జోడీగా నటిస్తుంది.

815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles