విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి వినూత్న టైటిల్

Wed,May 22, 2019 09:07 AM
interesting title for Vijay Devarakonda movie

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రం జూలై 26న నాలుగు భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా, హీరో అనే బైలింగ్యువ‌ల్ చిత్రం ఇటీవ‌ల లాంచ్ అయింది. మ‌రోవైపు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి కె.ఏ వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి, కేథ‌రిన్ థెస్రా కథానాయికలుగా నటిస్తున్నారు. న‌వ్య‌పంథాలో సాగ‌నున్న ఈ చిత్రానికి బ్రేక‌ప్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. వివిధ కోణాల్లో తాను కలుసుకున్న అమ్మాయిలను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ బాదితుడిగా మిగిలిపోతాడట విజ‌య్ . అందుకే సినిమాకు బ్రేకప్ అనే టైటిల్ బాగుంటుంద‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట‌. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గానే ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

2956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles