తేజూ చిత్రానికి వెరైటీ టైటిల్

Tue,June 4, 2019 04:34 PM

ఆరు ప‌రాజ‌యాల త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి చిత్రంతో మాసివ్ హిట్ కొట్టాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. ఈ చిత్రం అందించిన విజ‌యం తేజూకి కొండంత బ‌లాన్ని ఇచ్చింది. త్వ‌రలో మారుతితో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. మారుతి- తేజు కాంబినేష‌న్‌లో రానున్న చిత్రం ఎమోష‌న‌ల్‌గా ఉంటుంద‌ట‌. హృద‌యాన్ని హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో సాగుతుంద‌ట‌. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఈ మూవీని మారుతి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తేజు తండ్రి పాత్ర‌లో రావు ర‌మేష్ న‌టిస్తార‌ట‌. ఈ చిత్రానికి భోగి అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తాజా స‌మాచారం.గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మను కథానాయకిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

1661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles