నితిన్ సినిమాలో కీల‌కం కానున్న చ‌ద‌రంగం ఆట‌..!

Sat,October 5, 2019 11:57 AM

ల‌వ‌ర్ బోయ్ నితిన్ ప్ర‌స్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రష్మిక మందన్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. చ‌ద‌రంగం ఆట‌కి సినిమాలో చాలా ప్రాముఖ్య‌త ఉన్న కార‌ణంగా ఈ టైటిల్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి సినిమాల‌లో మిస్ట‌రీ, స‌స్పెన్స్ త‌ప్ప‌కుండా ఉంటాయి. మ‌రి ఈ చిత్రాన్ని ఎలా తెర‌కెక్కిస్తాడో చూడాలి. కాగా, నితిన్ తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌పై నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కి ప‌వర్ పేట అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు టాక్. మ‌రోవైపు నితిన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles