కీర్తి సురేష్ సినిమాకి ఆస‌క్తిక‌ర టైటిల్‌..!

Fri,May 17, 2019 10:57 AM
interesting title for keerthy 20

మ‌హాన‌టి బ‌యోపిక్‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన కీర్తి సురేష్ ప్ర‌స్తుతం కోలీవుడ్‌, బాలీవుడ్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. తెలుగులోను ఆమె ఓ చిత్రం చేయ‌నుంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. కీర్తి సురేష్ 20వ మూవీగా తెర‌కెక్క‌నున్న ఆ చిత్రం ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు నిర్మిస్తుండ‌గా, న‌రేంద్ర‌నాథ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కానున్నాడు. రాజేంద్రప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నదియా .. కమల్ కామరాజు .. భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. స‌ఖి అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేశారని అంటున్నారు. స‌ఖి పేరుతో అప్ప‌ట్లో వ‌చ్చిన చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కాగా, అదే పేరుతో రానున్న కీర్తి సురేష్ మూవీ కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు యూరప్ లో జరుగుతోంది. మ‌రో వైపు అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా ఓ సినిమా చేస్తుంది కీర్తి. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. జూన్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంతో కీర్తికి బాలీవుడ్ డెబ్యూ మూవీ కానుంది.

1397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles