బ‌న్నీ- త్రివిక్ర‌మ్ మూవీకి ఆస‌క్తిక‌ర టైటిల్‌..!

Sat,March 16, 2019 12:52 PM
interesting title for bunny trivikram movie

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేసేందుకు సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతున్న ఇంత వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ళ‌లేదు. బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో మేక‌ర్స్ ఉన్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ టైటిల్ ఫిలిం న‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. నాన్న‌-నేను అనే టైటిల్‌తో బ‌న్నీ 19వ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని మాట‌ల మాంత్రికుడు అనుకుంటున్నాడ‌ట‌. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరహాలోనే ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్‌తో న‌డుస్తుండ‌డంతో చిత్రానికి నాన్న‌- నేను అనే టైటిల్ పెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ చిత్రాలుగా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి వస్తున్నఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ.. గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బేన‌ర్‌ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో బ‌న్నీని స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడు త్రివిక్ర‌మ్. థ‌మ‌న్ బాణీలు స‌మ‌కూర్చ‌నున్నాడు. ఇక క‌థానాయిక‌లుగా ర‌ష్మిక మంథాన‌, పూజా హెగ్డే, కేథ‌రిన్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంద‌ని విశ్వనీయ వర్గాల స‌మాచారం.

2458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles