బ‌న్నీ- త్రివిక్ర‌మ్ చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్‌..!

Tue,April 16, 2019 08:34 AM
interesting title for allu arjun movie

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూజా హెగ్డే కథానాయికగా న‌టిస్తున్నఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించ‌నున్నారు. యువ హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సత్యరాజ్, సునీల్, రాజేంద్రప్రసాద్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగాయి. తాజా చిత్రం కూడా అలానే ఉంటుందని అంద‌రు భావించారు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్నీ 19వ చిత్రం త‌ల్లీ-కొడుకు అనుబంధం నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ని అంటున్నారు. తల్లి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్లనే, ఆ పాత్రకి గాను 'టబు'ను తీసుకున్నారని అంటున్నారు. ఇక చిత్రానికి టైటిల్‌గా అల‌క‌నంద అనే టైటిల్ బాగుంటుంద‌ని యూనిట్ ఆలోచిస్తుంద‌ట‌. చిత్రం ఎలాగూ త‌ల్లి పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబ‌ట్టి ఈ టైటిల్ చిత్రానికి స‌రిగ్గా యాప్ట్ అవుతుంద‌ని యూనిట్ భావిస్తుంద‌ట‌. చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్నారు.

2246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles