ఆది చిత్రానికి ఆస‌క్తిర టైటిల్‌

Wed,June 12, 2019 11:55 AM

ఒక‌వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తూ, మ‌రో వైపు సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తున్న న‌టుడు ఆది పినిశెట్టి. తాజాగా ఆయ‌న ఓ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించ‌నున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఇళ‌య‌రాజా తెలుగు వ‌ర్షెన్‌కి క్లాప్ కొట్టగా, నాని త‌మిళ వ‌ర్షెన్‌కి క్లాప్ కొట్టాడు. అల్లు అర‌వింద్ స్విచ్ ఆన్ చేశారు. బోయ‌పాటి శీను, గోపిచంద్ మలినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్‌కి అందించారు. క్లాప్ అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేశారు. ఆకాంక్ష సింగ్ క‌థానాయికగా న‌టిస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles