అర‌వింద్ స్వామి చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్

Tue,June 18, 2019 11:00 AM
Interesting Title And First Look Poster Of Pulanaivu

త‌మిళ మ‌న్మ‌థుడు అర‌వింద్ స్వామి జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. చివ‌రిగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చెక్క చివంత వాన‌మ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన అర‌వింద్ స్వామి ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో సంతోష్ పీ జ‌య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అర‌వింద్ స్వామి బ‌ర్త్ డే సంద‌ర్భంగా కొద్ది సేప‌టి క్రితం చిత్ర టైటిల్‌తో పాటు పోస్ట‌ర్ రివీల్ చేశారు మేక‌ర్స్. పుల‌నైవు అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్ర పోస్ట‌ర్ చూస్తుంటే ఈ మూవీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో అరవింద్ స్వామి డిటెక్టివ్‌గా క‌నిపించ‌నున్నారని అంటున్నారు. డి ఇమ్మాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

4919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles