త‌న ఇంటికి బ్లెస్సింగ్ అని పేరు పెట్టిన బ‌న్నీ

Fri,October 4, 2019 08:55 AM

ఈ మ‌ధ్య కాలంలో బ‌న్నీ త‌న సినిమాల క‌న్నా ప్రాప‌ర్టీస్‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్ర‌తి విష‌యంలో స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటున్నాడు. అందుకే ఆ మ‌ధ్య‌ భారీ ఖ‌ర్చుతో కార‌వ్యాన్ త‌యారు చేయించుకున్నాడు. ముంబైకి చెందిన ప్ర‌ముఖ డిజైన‌ర్ అల్లు అర్జున్ టేస్ట్‌కి త‌గ్గ‌ట్టు ఇంటీరియ‌ర్‌ని డిజైన్ చేశారు. ఇక ఇటీవ‌ల త‌న గ్యారేజ్‌లోకి మ‌రో కొత్త వాహ‌నం తీసుకొచ్చారు బ‌న్నీ. రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారును కొనుగోలు చేసిన బ‌న్నీ ఆ కారుతో ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంట్లోకి మ‌రో కారు వ‌చ్చింది. దానికి బీస్ట్ అని పేరు పెట్టిన‌ట్టు తెలిపాడు.


తాజాగా తాను కొత్త ఇంటికి భూమి పూజ చేసిన‌ట్టు చెబుతూ దానికి బ్లెస్సింగ్ అనే పేరు పెట్టిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా స్ప‌ష్టం చేశాడు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బ‌న్నీ భూమి పూజ చేయ‌గా,దానికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల‌.. వైకుంఠ‌పుర‌ములో అనే చిత్రం చేస్తున్నాడు బ‌న్నీ. ఇందులో ట‌బు, స‌త్య‌రాజ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.
View this post on Instagram

BLESSING

A post shared by Allu Arjun (@alluarjunonline) on

2518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles